Harish Shankar : విజ్ఞాన ప్రదర్శనలొద్దు: హరీష్ శంకర్ ఎవరికి సెటైర్ వేసినట్టు.?

NQ Staff - November 26, 2022 / 10:43 PM IST

Harish Shankar : విజ్ఞాన ప్రదర్శనలొద్దు: హరీష్ శంకర్ ఎవరికి సెటైర్ వేసినట్టు.?

Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా తెరకెక్కాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా వెనక్కి వెళుతూ వెళుతూ వుంది. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న హరీష్, అలా అలా ఎదురుచూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నాడు.

ఎప్పటికప్పుడు హరీష్ తదుపరి సినిమా విషయమై బోల్డన్ని గాసిప్స్ వస్తున్నాయి. ఓ యంగ్ హీరోకి కథ చెప్పాడంటూ ఆ మధ్య గాసిప్స్ వస్తే, అది కేవలం దుష్ప్రచారమని కొట్టి పారేశాడీ టాలెంటెడ్ డైరెక్టర్.

ఆ రీమేక్.. అందుకేనా అసహనం.?

విజయ్, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘తెరి’ సినిమాని హరీష్ రీమేక్ చేయబోతున్నాడనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. నిజానికి, ఇది పాత గుసగుసే. ఆ ‘తెరి’ తెలుగులోకి ‘పోలీసోడు’ పేరుతో వచ్చింది కూడా.

‘లూసిఫర్’ ఓటీటీలో తెలుగులో అందుబాటులో వున్నా ‘గాడ్‌ఫాదర్’ పేరుతో చిరంజీవి హీరోగా తెరకెక్కించలేదా.? సో, ‘తెరి’ విషయంలోనూ అలాంటి ప్రయత్నం జరిగే అవకాశం లేకపోలేదు.

కాగా, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమా వద్దనీ, పవన్ కళ్యాణ్‌తో పాన్ ఇండియా సినిమా చేయమనీ ఓ నెటిజన్, హరీష్ శంకర్‌కి విజ్ఞప్తి చేశాడు. ‘నేను అంగీకరించను..’ అంటూ ట్వీటేసిన హరీష్, ఇంకో ట్వీటులో ‘విజ్ఞాన ప్రదర్శనలు వద్దు’ అనే మీమ్ పోస్ట్ చేశాడు. ఇంతకీ, హరీష్ ఎవరికి సెటైర్లు వేసినట్లు.? ఏమో, ఆయనకే తెలియాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us