Harish Shankar : పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ భేటీ.! ‘తెరి’పై ప్రకటన చేయలేదేం.?
NQ Staff - December 9, 2022 / 03:00 PM IST

Harish Shankar : ‘హరిహర వీరమల్లు’ సెట్లో పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి వుంది. అయితే, కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా, ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాని పక్కన పెట్టి, ‘తెరి’ అనే తమిళ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మాకొద్దీ ‘తెరీ’ రీమేక్..
పవన్ కళ్యాణ్ అభిమానులు బాగా హర్టయ్యారు. ‘మాకొద్దీ తెరి రీమేక్..’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి తెచ్చారు. హరీష్ శంకర్‌ని నానా తిట్లూ తిడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ – హరీష్ భేటీ జరిగింది.
‘తెరి’ గురించి వస్తున్న విమర్శలపై హరీష్ శంకర్ స్పందించలేదు. కానీ, పవన్‌తో భేటీకి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో, అభిమానులకు మరింత మండిపోతోంది. హరీష్ మాత్రం ఏం చేయగలడు.? అక్కడ పరిస్థితులు అలాంటివి.