HARI TEJA: డెలివ‌రీ స‌మ‌యంలో హ‌రితేజ‌కు క‌రోనా పాజిటివ్..ఆ బాధ‌ల‌ను వీడియో ద్వారా వివ‌రించిన బిగ్ బాస్ భామ‌

బుల్లితెర‌, వెండితెర‌పై మెరిసిన హ‌రితేజ బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ అయింది. ఏప్రిల్ 5న ఈమె పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌గా, రీసెంట్‌గా త‌న కూతురితో దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే తాజాగా హ‌రితేజ జ‌త‌న డెలివ‌రీ స‌మయంలో ప‌డ్డ బాధ‌ల‌ను వీడియో ద్వారా వివ‌రించి అంద‌రిని అల‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాగాలేవని అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హరితేజ చెప్పుకొచ్చింది.

నాకు పాప పుట్టింద‌ని అంద‌రు విషెస్ చెప్పారు. వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు. ఆ స‌మ‌యంలో నేను ఎవరికి రిప్లై ఇచ్చే ప‌రిస్థితిలో లేను. డెలివరికి వారం ముందు నాకు క‌రోనా పాజిటివ్ అని వ‌చ్చింది. రెగ్యుల‌ర్ చెక‌ప్‌కు వెళ్లిన‌ప్పుడు ఈ విష‌యం తేల‌డంతో నన్ను కోవిడ్ ఆసుప‌త్రికి వెళ్లాల‌ని అన్నారు. చాలా భ‌యం వేసింది. ఆప‌రేష‌న్ చేసి బేబిని బ‌య‌ట‌కు తీసి క‌రోనా ప‌రీక్ష చేయగా, నెగెటివ్ వ‌చ్చింది. నా ద‌గ్గ‌ర నుండి బేబిని వెంట‌నే తీసుకెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో నా ప‌క్కన ఎవ‌రు లేరు. నా భ‌ర్త మాత్ర‌మే తోడుగా ఉన్నారు. పాపని వీడియో కాల్స్ లో చూడాల్సి వచ్చింది. మా వాళ్లు అంతా ఐసోలేషన్ లో ఉన్నారు. కొందరు స్నేహితులు ఆ సమయంలో సాయంగా ఉండటం వల్ల బయట పడ్డాను అంటూ హరితేజ భావోద్వేగంకు గురయ్యింది. గర్బవతులు ప్రతి ఒక్కరు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మ‌న‌కు రాదు అనే అజాగ్ర‌త్త వ‌ద్దు అంటూ హ‌రితేజ ప‌లు విషయాలు చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

Advertisement