Bandi Sanjay And Hari Prasad : ప్రధాని నోట నా పేరు.. జీవితాంతం మర్చిపోలేను
NQ Staff - November 27, 2022 / 09:36 PM IST

Bandi Sanjay And Hari Prasad : ప్రధాని నరేంద్ర మోడీ నేడు మన్ కి బాత్ కార్యక్రమంలో సిరిసిల్ల చెందిన హరి ప్రసాద్ అనే చేనేత కార్మికుడి గురించి పదే పదే ప్రస్తావించారు. హరి ప్రసాద్ చేతితో స్వయంగా నేచిన జీ 20 వస్త్రాన్ని ప్రధాని చూపిస్తూ ఆయన పేరును ప్రస్తావించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
టీవీలో మన్ కి బాత్ కార్యక్రమాన్ని చూస్తున్న సమయంలో హరి ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారట. ఈ సందర్భంగా హరి ప్రసాద్ ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు.

Hari Prasad Felicitated By BJP State President Bandi Sanjay
తన యొక్క విద్యను… తనకు తెలిసిన చేనేత పనిని నలుగురికి నేర్పడం వల్లే తనకు ఇంత మంచి పేరు వచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ప్రశంసలు దక్కించుకున్నానని హరి ప్రసాద్ పేర్కొన్నాడు.

Hari Prasad Felicitated By BJP State President Bandi Sanjay
ప్రధాని నోట నా పేరు రావడం జీవితాంతం మర్చిపోలేనట్టు హరి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అంతరించిపోతున్న చేనేత కలను నలుగురికి నేర్పించాలనే ఉద్దేశంతో ఈ పనికి హరిప్రసాద్ సిద్ధమయ్యాడు. ఆయనను ఎంతో మంది అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ప్రశంసలు తెలియజేశారు.