Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్.!

NQ Staff - November 24, 2022 / 06:06 PM IST

Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్.!

Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని చిత్ర యూనిట్ మీడియాతో షేర్ చేసుకుంది. అక్టోబర్ చివరి వారం నుంచి ఈ సినిమా కీలక షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

‘చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది..’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. పవన్ కళ్యాణ్‌తోపాటు దాదాపు 900 మంది నటీనటులు, సిబ్బంది ఈ కీలక షెడ్యూల్ కోసం పనిచేస్తున్నారట.

ఇదొక మైలు రాయి..

‘హరిహర వీరమల్లు సినిమా ఓ మైలురాయి అవుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు చేసుకుంటారు..’ అంటూ సినిమాపై తమ నమ్మకాన్ని చిత్ర నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్పింది.

పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ఈ సినిమాలో ప్రధాన తారాగణం. క్రిష్ దర్శకత్వంలో ఈ ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కతోంది. వచ్చే వేసవిలో ఈ సినిమాని విడుదల చేసేందుకోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. డిసెంబర్ నెలాఖరు నాటికి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయే అవకాశాలున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us