తండ్రి అయిన హార్దిక్ పాండ్య

Advertisement

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ మరియు ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తండ్రి అయ్యాడు. తన ప్రియురాలు సెర్బియన్ మోడల్, నటి నటాషా స్టాన్‌కోవిక్‌తో పాండ్యా చాలాకాలం నుంచి కలిసి ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా నటాషా స్టాంకోవిచ్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

అయితే ఈ విషయాన్ని హార్దిక్ పాండ్య ‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కుమారుడి చేతిని పట్టుకున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు పాండ్య. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను పాండ్య సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. త్వరలోనే పెళ్లి చేసుకోనున్న సమయంలో… తన ప్రియురాలు గర్భవతి అని మరి కొన్న ఫొటోలు మరల పోస్టు చేశాడు.

చివరకు ఈ రోజు తండ్రి అయ్యానంటూ తన దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.ఇదిలా ఉంటే వెన్నునొప్పి కారణంగా హార్దిక్ క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఇప్టటి వరకు 105 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన పాండ్యా 1,799 పరుగులు చేశాడు. 109 వికెట్లు తీశాడు. దీంతో విలువైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.అలాగే ఈ ఏడాది జరగాల్సిన ఐపీల్ ఆడుతాడో.. లేదో.. చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here