YS Jagan Mohan Reddy : వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్.! అవి సాధిస్తే ఎదురే లేని మొనగాడే.!

NQ Staff - December 21, 2022 / 01:19 AM IST

YS Jagan Mohan Reddy : వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్.! అవి సాధిస్తే ఎదురే లేని మొనగాడే.!

YS Jagan Mohan Reddy :  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు. అప్పట్లో ముఖ్యమంత్రి తనయుడిగా గుర్తింపు.. కడప ఎంపీగానూ వైఎస్సార్ అభిమానుల్లో, అందునా యూత్‌‌లో కొంత స్పెషల్ ఎట్రాక్షన్.! కానీ, ఇప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టికి ఆయన అధ్యక్షుడు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా.!

2019 ఎన్నికల్లో దేశమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసింది. అందుక్కారణం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధించిన విజయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది.! అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమా హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రంగంలోకి దిగితే, సుదీర్ఘ రాజకీయ అనుభవం.. పైగా, అప్పటికి అధికారం తన చేతిలో వుండడం.. వెరసి చంద్రబాబు ఇంకో వైపు. ఈ ఇద్దర్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్నారు.

2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అలా పార్టీ నిర్వీర్యమైపోయిందనే అయోమయంలో వైఎస్ జగన్ కొట్టుమిట్టాడలేదు. ‘కొట్టారు.. తీసుకున్నాం.. మాకు సమయం వచ్చినప్పుడు మేం కొడతాం..’ అన్నారు.. రాజకీయంగా చంద్రబాబుని గట్టి దెబ్బ కొట్టారు.. అదీ 2019 ఎన్నికల ద్వారానే.

చంద్రబాబులా వైఎస్ జగన్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వలేదు. ఏ ‘నవరత్నాల’ గురించి ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వాటిని తు.చ. తప్పకుండా పాటించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. కొత్త సంవత్సరంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చాలా సవాళ్ళున్నాయి. ప్రత్యేక హోదా సహా పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టాల్సిందే. అదొక్కటే కాదు, రాష్ట్రానికి రాజధాని లేదన్న ఆవేదన ప్రజల్లో కలగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుంది. ఒకటి కాదు, మూడు రాజధానులంటున్న వైఎస్ జగన్, వచ్చే ఏడాదిలో ఆ దిశగా ఎలాంటి కీలకమైన ముందడుగు వేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Happy Birthday YS Jagan Mohan Reddy Garu

Happy Birthday YS Jagan Mohan Reddy Garu

175 అనే లక్ష్యంతో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్ జగన్, 2024 ఎన్నికల లోగా విపక్షాల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సర్వసన్నద్ధం చేస్తున్నారు పార్టీ శ్రేణుల్ని. రానున్న ఏడాది కాలంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సి వచ్చినాసరే, ఆ 175 సీట్లు కొల్లగొట్టగలిగితే.. దేశ రాజకీయాల్లోనే అదో సరికొత్త సంచలనం అవుతుందన్నది నిర్వివాదాంశం.

వచ్చే ఎన్నికల్లో అయినా, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు అవసరం ఏర్పడితే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పని పరిస్థితి కేంద్రానికి వస్తే.. అప్పుడు కేంద్రాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కే వ్యూహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర సిద్ధంగా వుండే వుంటుంది. అది సాధించిననాడు.. హీ ఈజ్ అన్ స్టాపబుల్ అంతే.!

Happy Birthday To YS Jagan Mohan Reddy Garu

Happy Birthday YS Jagan Mohan Reddy Garu

కోట్లాది మంది యువతకి ‘నేను విన్నాను.. నేను వున్నాను..’ అని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్, యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా.. మరింత మెరుగైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తారని ఆశిస్తూ, హ్యాపీ బర్త్ డే టు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us