మార్కెట్లోకి వచ్చిన గోమూత్ర శానిటైజర్స్
Admin - September 11, 2020 / 09:23 AM IST

ప్రస్తుత కరోనా రోజుల్లో మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక దీనితో మార్కెట్లోకి రకరకాల మాస్కులు, శానిటైజెర్లు వస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో నకిలీ శానిటైజెర్లు కూడా జోరుగా తయారు చేసారు. ఇది ఇలా ఉంటె గో మూత్రంతో తయారు చేసిన శానిటైజర్ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక సహకార సంస్థ గోమూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు.
అయితే జామ్ నగర్ లోని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి సభ్యులు ఈ గోమూత్రంతో శానిటైజర్లను తయారు చేస్తున్నారు. ఈ శానిటైజర్లకు ‘గో సేఫ్’ శానిటైజర్ అని నామకరణం చేసారు. ‘మేము ఎఫ్ డీసీఏ నుంచి గో సేఫ్ బ్రాండ్ శానిటైజర్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు లైసెన్స్ తీసుకుంటున్నాం. సుమారు వారం రోజుల్లోగా లైసెన్స్ వస్తుంది. ఆ తర్వాత శానిటైజర్లను మార్కెట్లోకి విడుదల చేస్తాం.’ అని కామధేను దివ్య ఔషధ మహిళా మండలి డైరెక్టర్ మనీషా వెల్లడించారు.