Covid Virus : కోట్లాది మందికి కొత్త కోవిడ్ వైరస్.! వణుకుతోన్న ప్రపంచం.!
NQ Staff - December 26, 2022 / 01:44 PM IST

Covid Virus : కోవిడ్ వైరస్ వందలు, వేలు, లక్షల్లో కాదు.. ఈసారి కోట్లాది మందికి తక్కువ సమయంలో సోకుతోందని ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధానంగా చైనాలో సగం జనాభా ప్రస్తుతం కోవిడ్ వైరస్‌తో బాధపడుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే.
చైనా సంగతి సరే.. భారతదేశం పరిస్థితి ఏంటి.? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా జాడ వెలుగు చూస్తుండడంతో, భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
కోవిడ్ కొత్త వైరస్ ప్రభావమేనా.?
గతంలో వచ్చిన కోవిడ్ వైరస్ ఇప్పుడు కనిపిస్తున్న కోవిడ్ వైరస్.. ఈ రెండింటి మధ్యా ‘మార్పులు’ చాలానే వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మందికి సోకుతుంది గానీ, ప్రాణాపాయం పెద్దగా వుండకపోవచ్చన్నది ఓ వాదన.
అయితే, కోవిడ్ విషయంలో ఇంకా సంపూర్ణ అవగాహన వైద్య నిపుణుల్లోనే లేదు. దాంతో, ఎప్పుడెలా ఈ మహమ్మారి విరుచుకుపడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తాజాగా బీహార్‌లోని గయ విమానాశ్రయంలో జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నలుగురు విదేశీయులకు కోవిడ్ వైరస్ పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్‌కి గురవుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేయడంతోపాటు, దేశంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, కోవిడ్ వైరస్ సంబంధిత మందుల లభ్యత.. వంటి విషయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెడుతున్నాయి.