Sreeleela : శ్రీలీలపై పీకల్లోతు కోపంలో ఉన్న పూజాహెగ్డే.. అంత పని చేసిందా..?

NQ Staff - January 25, 2023 / 11:08 AM IST

Sreeleela : శ్రీలీలపై పీకల్లోతు కోపంలో ఉన్న పూజాహెగ్డే.. అంత పని చేసిందా..?

Sreeleela : శ్రీలీల ఇప్పుడు ఫుల్ స్వింగ్‌ లో కనిపిస్తోంది. వరుసగా చేసిన రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. పెండ్లి సందడి, ధమాకా మూవీలు మంచి హిట్ కావడంతో ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. అప్‌ కమింగ్‌ హీరోయిన్లలో శ్రీలీలకు ఉన్నంత ఫాలోయింగ్ మిగతా వారికి లేదనే చెప్పుకోవాలి.

ఎందుకంటే శ్రీలీల క్యూట్ అందాలకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అయిపోతున్నారు. ఆమెకు రోజు రోజుకూ మాస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆమెను చూసి పూజాహెగ్డే కోపంలో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్‌-మహేశ్‌ కాంబోలో వస్తున్న మూవీలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది.

కాగా ఇందులో శ్రీలీల కూడా ఓ కీలక రోల్‌ చేస్తోందంట. అయితే పూజాహెగ్డేకు ముందుగా చెప్పిన కథ కంటే శ్రీలీల పాత్రకే ఇంపార్టెన్స్‌ బాగా ఇస్తున్నారంట. దాంతో పాటు ఈ సినిమాలో మహేశ్‌-శ్రీలీల మధ్య ఓ బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ను కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

వీటితో ఆమెకు అత్యధిక ప్రాధాన్యత పెరిగిపోవడం ఖాయం అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పూజాహెగ్గే శ్రీలీల మీద కోపంగా ఉందంట. తన అవకాశాలకు గండి కొడుతోందంటూ ఆమె ఇలా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాలో పూజాహెగ్డే కంటే శ్రీలీల హైలెట్‌ అయితే మాత్రం పూజా ప్లేస్‌ను శ్రీలీల రీప్లేస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us