Central Election Commission : ఐదు రాష్ట్రాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నజర్.. బదిలీలు షురూ..!

NQ Staff - June 3, 2023 / 03:37 PM IST

Central Election Commission : ఐదు రాష్ట్రాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నజర్.. బదిలీలు షురూ..!

Central Election Commission : ఐదు రాష్ట్రాల శాసన సభల గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ పలు ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల సీఎస్, సీఈవోలకు మార్గదర్శకాలను జారీ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.

మిజోరాం రాష్ట్రానికి 17-12-23, ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి 03-01-24 రోజున, మధ్యప్రదేశ్ కు 06-01-24న, రాజస్థాన్ కు రూ.14-01-24న, తెలంగాణకు 16.-01-24వ తేదీలు శాసన సభలకు చివరివి. కాబట్టి ఈ లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో మూడేండ్లు దాటిన అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Guidelines Issued CS And CEOs Of Respective States On Posting Of Election Officers

Guidelines Issued CS And CEOs Of Respective States On Posting Of Election Officers

ఆయా జిల్లాల్లో కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా బదిలీ చేయాలని సూచించింది. అలాగే ఏ అధికారికి అయినా సరే సొంత జిల్లాల్లో పోస్టింగ్ అస్సలు ఇవ్వొద్దని తెలిపింది. బదిలీ ప్రక్రియను పూర్తి చేసి జులై 31లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక తెలంగాణ ఎన్నికల అప్ డేట్ రావడంతో రాష్ట్రంలో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

ఇప్పటికే ఆయా పార్టీల్లో జంపింగ్ లు కూడా మొదలయ్యాయి. త్వరలో మరింత ఊపందుకునే అవకాశం కూడా ఉంది. అన్ని పార్టీలు వ్యూహ రచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us