Gudivada Amarnath : గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ చమక్కులు

NQ Staff - February 1, 2023 / 04:42 PM IST

Gudivada Amarnath  : గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ చమక్కులు

Gudivada Amarnath  : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉంటారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తూ యాక్టివ్ గా ఉండే గుడివాడ అమర్‌నాథ్ మరో వైపు ప్రత్యర్థులకు చురకత్తు లాంటి ట్వీట్స్ ని విసురుతూ ఉంటాడు.

తాజాగా మరోసారి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ లో ప్రత్యర్థులకు చురకలంటించారు. ఆక్సీ మోరాన్‌కు మరికొన్ని ఎగ్జాంపుల్స్‌– బీజేపీతో వివాహం… చంద్రబాబుతో సంసారం… హిందీ అమ్మాయితో పెళ్ళి… రష్యన్‌తో పిల్లలు… అన్న పరువు బజారు పాలు, తండ్రి పరువు బుగ్గి పాలు!

బాబూ నిత్య కల్యాణ్‌… చారూ మజుందార్, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ… మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కథ, స్క్రీన్‌ప్లే… అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమిందార్‌ జీవిత చరిత్ర బాగా చదువుకో!

ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలు చదివే గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టటానికి వీల్లేదని… అమరావతి భూముల్ని పేదలకు పంచితే సామాజిక అసమతౌల్యం వస్తుందని వాదించిన బాబు బ్యాచ్‌ది క్లాస్‌ వార్‌ కదా?

ఇప్పటికే ఈ ట్వీట్స్ ఎవరి గురించి అనేది మీకే అర్థమయ్యి ఉంటాయి.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us