Group 4 Exam Balagam Movie Question Came Surprise Candidates : గ్రూప్ -4 ఎగ్జామ్ లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏమడిగారో తెలుసా?

NQ Staff - July 1, 2023 / 06:15 PM IST

Group 4 Exam Balagam Movie Question Came Surprise Candidates : గ్రూప్ -4 ఎగ్జామ్ లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏమడిగారో తెలుసా?

Group 4 Exam Balagam Movie Question Came Surprise Candidates :

ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ కు సంబంధించిన పేపర్స్ లో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తూనే ఉంటాయి.. మనం చూస్తూనే ఉంటాం.. ఇప్పటికే చాలా సార్లు ఇలా సినిమాలకు సంబందించిన ప్రశ్నలు ఎగ్జామ్స్ లో వచ్చిన సందర్భాలు ఎన్నో.. మరి తాజాగా గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. ఇందులో కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్న అడిగారు.

అది కూడా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన పక్కా పల్లెటూరు పాత్రలతో తెరకెక్కిన బలగం నుండి ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న విన్నవారంతా షాక్ అయ్యారు.. గ్రూప్ 4 వంటి ఎగ్జామ్ లో బలగం లాంటి చిన్న సినిమాలోని ప్రశ్న రావడం అభ్యర్థుల ఆశ్చర్యానికి కారణం..

ఈ సినిమాను వేణు డైరెక్ట్ చేసాడు.. ఒక కమెడియన్ గా ఉన్న వేణు తీసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఏంటంటే.. బలగం సినిమాకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అని ప్రశ్న అడిగి అందుకు సరిపోయే సమాధానాలను అప్షన్స్ గా కూడా ఇచ్చారు..

ఈ ప్రశ్న ఈజీగానే ఉన్న కూడా అధికారులు అప్షన్స్ తో అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా చిన్నది అయినా అందులో ఎమోషన్స్ అన్నిటిని వేణు చాలా బ్యాలెన్స్ గా చూపించిన తీరుతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తెలంగాణ సంస్కృతిని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఈ సినిమా తెలంగాణ ప్రజలను బాగా ఆకట్టుకుంది. 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 30 కోట్లు వసూళ్లు రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us