Queens: రాజులే కాదు మనదేశంలో రాణులు కూడా ధైర్యవంతులై.. రాజుని మించిన రాణులు..!!

భారతదేశ చరిత్ర ను తీసుకుంటే ఎంతో మంది రాజులు, సైనికులు తమ తమ రాజ్యం కోసం ఎన్నో గొప్ప గొప్ప సాహసాలు చేశారు.. ప్రాణాలు అర్పించారు.. వారి వీరోచిత పోరాటపటిమలకు నిదర్శనంగా ఇప్పటికీ మనకు ఎన్నో శిలా స్థూపాలు కనిపిస్తాయి. శాసనాలు లిఖితపూర్వకంగా దర్శనమిస్తాయి.. రాజుల సాహసాలు తరతరాలు చెప్పుకునే ఎన్నో రకాలుగా వారి కీర్తి ని ప్రపంచమంతా చాటిచెప్పారు కానీ మనదేశంలో రాణులు కూడా అదే విధంగా ధైర్య సాహసాలు ప్రదర్శించారు.. అలాంటి మహారాణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Greatest Indian Queens in History
Greatest Indian Queens in History

భారతదేశ చరిత్రలో ఎందరో వీరవనితలు తన ధైర్య సాహసాలకు పనిచెప్పారు.. అలా రాణి దుర్గావ‌తి ఆమె సైనిక పరాక్రమం ముందు మొఘల్ సైనికులు నిలవలేకపోయారు. రాజ్‌పూత్ చ‌క్ర‌వ‌ర్తి కీర‌త్ రాయ్ కుటుంబంలో రాణి దుర్గావ‌తి మార‌వి జమించగా 1550లో భ‌ర్త చ‌నిపోయాక రాజ్య బాధ్యతలు తీసుకుని భర్త లేని లోటును రాజ్యానికి తెలియనివ్వలేదు. మొగ‌ల్ సైన్యాధిప‌తి ఖ్వాజా అబ్దుల్ మాజిద్ అస‌ఫ్ ఖాన్‌ తో జరిగిన యుద్ధంలో ఆమె విజయం సాధించింది. తెలుగువారు ఉన్నంత కాలం గుర్తిండే పేరు రాణీ రుద్ర‌మ‌దేవి.. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆమెకోసం ఓ పేజీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. 14 ఏళ్ల వయసులోనే కాకతీయ సామ్రాజ్య అధికారం చేపట్టి ఎంతోమంది రాజులు ఓడించింది. ఫలితంగా వీర వనితగా రాణి రుద్రమదేవి అవతరించింది..

ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారామ్ భార్య మ‌హారాణి తారాబాయి వీర సాహసాలు ఎవరు మార్చిపాలేరు. 1700 వ సంవత్సరంలో భర్త చనిపోయాక రాజ్య పాలనా బాధ్యత తీసుకుని మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. మొఘల్ చక్రవర్తులు ఆమెకు , ఆమె యుద్ధ విన్యాసాలకు, ధైర్య సాహసాలకు ముగ్దులైపోయారు. మ‌రాఠా రాజులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చి వారంద‌రితో క‌లిసి ఔరంగ‌జేబుకు వ్య‌తిరేకంగా పోరాడింది. ఫలితంగా వీరనారి బిరుదు పొందింది..1857 లో బ్రిటిష్ వారిని ఎదిరించిన రాణీ లక్ష్మీబాయి, వారణాసి లో కాశి విశ్వనాధ్ ఆలయాన్ని పునర్నిర్మించిన మ‌హారాణి అహిల్యాబాయి హొల్క‌ర్, వంటి వీరవనితలు కూడా ఈ జాబితాలోకి చెందిన వారే.. వీరి సాహసాలను దేశం ఎప్పుడు గుర్తుంచుకుంటుంది.

Advertisement