Google : ఉద్యోగాలు పోతున్నాయ్.! పది వేల మంది ఉద్యోగులకు గూగుల్ ఝలక్.!
NQ Staff - November 22, 2022 / 09:28 PM IST

Google : ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం ముంచెత్తబోతోందన్న ఊహాగానాల నేపథ్యంలో, అందరూ జాగ్రత్తపడిపోతున్నారు. కార్పొరేట్ సంస్థలు.. అందునా, సాఫ్ట్‌వేర్ రంగ సంస్థలైతే మరీ అత్యుత్సాహం చూపిస్తూ, రకరకాల కారణాలు చెప్పి ఉద్యోగుల్ని పీకి పారేస్తున్నాయి.
ట్విట్టర్, ఫేస్‌బుక్.. ఇప్పటికే ఉద్యోగుల్ని పీకి పారేస్తున్న సంగతి తెలిసిందే. వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈసారి గూగుల్ వంతు..
గూగుల్ కూడా సుమారు 10 వేల మంది ఉద్యోగులకు షాక్ ఇవ్వబోతోందిట. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటనైతే రాలేదుగానీ, ఉద్యోగుల తొలగింపుపై మౌఖిక ఆదేశాలు వెళ్ళిపోయాయన్న ప్రచారం జరుగుతోంది.
మన దేశంలో కూడా చాలా లోకల్ కార్పొరేట్ సంస్థలు (ఐటీ రంగానికి సంబంధించి) ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు షురూ చేశాయట. వడపోత తొలుతగా అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగుల నుంచే మొదలు కానుందట.
మరి, ఇలా తొలగించబడ్డ ఉద్యోగుల పరిస్థితేంటి.? అసలు నిజంగానే మాంద్యం వస్తుందా.? రాదా.?
మాంద్యం వచ్చినా, రాకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగమైతే పెను ముప్పుగా మారబోతోంది.