2,500 చైనా యూట్యూబ్ చానల్స్ డిలీట్ చేసిన గూగుల్

Advertisement

చైనాకు భారత్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోకముందే.. ప్రస్తుతం గూగుల్ ఊహించని షాక్ ఇచ్చింది. అయితే వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ పై తప్పుడు సమాచారం తొలగించేందుకు సిద్ధమైన గూగుల్ యూట్యూబ్ ఛానల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే చైనాతో సంబంధం ఉన్న 2,500 యూట్యూబ్ ఛానల్స్‌ను తొలగించినట్లు సెర్చింజన్ గూగుల్ సంస్థకు తెలిపింది. అయితే వీటన్నింటిని జూన్, ఏప్రిల్ మధ్యనే తొలగించినట్లు పేర్కొంది.

భారత్, చైనా ల మధ్య జరిగిన వివాదాల దృష్ట్యా అందుకు ప్రతీకారంగా చైనాకు చెందిన పలు యాప్స్ ను భారత్ సర్కార్ నిషేదించింది. అయితే అదే దారిలో చాలా దేశాలు నడిచేలా కనిపిస్తున్నాయి. అలాగే టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు అన్నింటిని పరిశీలిస్తుంది. ఇందులో క్రమంగానే వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది. అయితే కరోనా తరువాత చైనా యాప్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ తొలగించడం ప్రతిఒక్కరిలో చర్చనీయ అంశంగా మారింది.

అసత్య సమాచారాల కారణంగానే వీటిని తొలగించినట్లు వెల్లడించింది. దీనిపై స్పందించాలని అని తెలపగా.. అమెరికాలోని చైనీస్ రాయబార కార్యాలయం రెస్పాండ్ కాలేదని సమాచారం వస్తుంది. అయితే గతంలో ఇలాంటి అసత్య సమాచార ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం చైనా ఖండించింది. ఇంతకముందు ఇతర దేశాలతో సంబంధం ఉన్న నటులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అసత్య సందేశాలు పంపారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇక గూగుల్ ఇచ్చిన దెబ్బకు చైనా కోలుకోవడం కష్టమేనని నిపుణులు అంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here