సీఎం జగన్ కు శుభవార్త చెప్పిన హై కోర్ట్

Advertisement

జగన్ ప్రభుత్వానికి గత కొన్ని నెలలుగా కోర్ట్ ల దగ్గర ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఇప్పటికే దాదాపు 100సార్లు కోర్ట్ లో ఎదురుదెబ్బలు తగిలాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, మూడు రాజధానుల విషయంలో ఇలా పలుమార్లు వైసీపీ ప్రభుత్వానికి కోర్ట్ ల దగ్గర ఎదురుదెబ్బలు తగిలాయి.

అయితే ఇవ్వాళ వైసీపీ ప్రభుత్వానికి హై కోర్ట్ ఒక శుభవార్తను చెప్పింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను తొలగించాలని హై కోర్ట్ లో ప్రజావ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్ట్ … పథకాలపై వైఎస్ఆర్ బొమ్మను వాడటంపై ప్రభుత్వానికి అడ్డు చెప్పలేమని వెల్లడించింది. ఈ వ్యాఖ్యతో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here