రైల్యే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో 80 ప్రత్యేక రైళ్లు

Advertisement

రైల్యే ప్రయాణికులకు కేంద్రం ఓ శుభవార్త తెలిపింది. అయితే ఈ నెల 12వ తేదీ నుండి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే 230 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఇక కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ప్రయాణం కాస్త సులువుగా ఉంటుందని చెప్పాలి. అయితే ఈ నెల 10 నుండి రైళ్లకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది అని రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

అయితే రైల్వే శాఖ తాజాగా ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్ల లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. ఇక వాటి వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌ – దర్బంగా (07007); దర్బంగా- సికింద్రాబాద్‌ (07008); బెంగళూరు- గువాహటి (02509), గువాహటి- బెంగళూరు (02510); కోర్బా- విశాఖపట్నం (08517); విశాఖపట్నం- కోర్బా (08518); హైదరాబాద్‌- పార్బణి (07563); పార్బణి- హైదరాబాద్‌ (07564) రైళ్లు నడవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here