Good news from oxford university : కరోనా పరీక్షలు కూడా ఇక ఇంట్లోనే

Advertisement

కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరికి ఉన్న ముఖ్య సమస్య కరోనా వారికి వచ్చింది అని గుర్తించడమే. ఎందుకంటే కరోనా వచ్చిన వారిలో చాలా మందిలో కూడా ఏ లక్షణాలు కనిపించకపోవడమే కారణం. దానితో ఇలా లక్షణాలు కనిపించని వారి నుండి మరింత మందికి ఈ కరోనా వ్యాపిస్తూ వెల్తూనే ఉంది. దానితో ప్రజలలో కరోనా ఎవరికీ వచ్చింది అనే విషయం తెలియక చాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారందరికీ కూడా ఒక శుభవార్త.

యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసిన హోమ్‌ టెస్ట్‌ల్లో కేవలం 20 నిమిషాల్లోనే ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ వ్యక్తికి సోకిందా అనేది తెలిసిపోతుంది అంట. జూన్‌లో నిర్వహించిన మానవ పరీక్షల ఫలితాల్లో ఇది 98.6 కచ్చితమైన ఫలితాలు కూడా అందించింది మన ఇంట్లోనే ఉండి కేవలం ఒక్క చుక్క రక్తంతో మనకు కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు అంట. ప్రస్తుతము మనం కరోనా పరీక్షలు చేయించుకోవాలంటే లాబ్స్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న తరువాత మెల్లగా మనకు కరోనా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అయితే ఆలా కాకుండా త్వరలో ఇంట్లోనే ఉండి మనకు కరోనా సోకిందో తెలుసుకొనే విధంగా ఇవి పనిచేస్తాయి కాబట్టి బ్రిటన్‌ ఆమోదముద్ర వేస్తుందనే ప్రచారంతో పెద్దసంఖ్యలో ఈ తరహా మెషీన్లను ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేపట్టారని టెలిగ్రాఫ్‌ తెలిపింది.

ఇక దానితో పాటు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌ డయాగ్నస్టిక్‌ కంపెనీల భాగస్వామ్యంతో కలిసి యూకే ర్యాపిడ్‌ టెస్ట్‌ కన్సార్షియం, నూతన యాంటీబాడీ టెస్ట్‌లను అభివృద్ధి చేశాయి. గత వారం ఉల్ట్సర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 300 మందిపై నిర్వహించిన పరీక్షలలో యాంటీబాడీ టెస్ట్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని యూకే-ఆర్‌టీసీకి చెందిన డాక్టర్‌ క్రిస్‌ హ్యాండ్‌ వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు 98.6 శాతం విజయం సాధించడం​ నిజంగా శుబవార్త అని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది పాటు సాగే ఈ ప్రక్రియను తాము రాత్రింబవళ్లు పనిచేసి 13 వారాల్లోనే సాధించామని తెలిపారు. ఇవన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే తమ ఈ ప్రయత్నాలు త్వరత్వరగా కొనసాగిస్తున్నట్లు తెలపడం జరిగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here