ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
Admin - August 19, 2020 / 01:02 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ బోర్డు బిజీగా ఉంది. ఇక ఈ లీగ్ అనంతరం ధోనీ వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసిన ధోనీకి ఘన వీడ్కోలు ఇవ్వాల్సిన బాధ్యత బోర్డు పై ఉందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు.
అయితే ఐపీఎల్ తర్వాత ధోనీ ఫెర్‌వెల్ మ్యాచ్‌పై ఆలోచిస్తాం. ధోని భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు. గ్రాండ్ సెండాఫ్ అందుకోవడానికి ధోని అన్ని విధాల అర్హుడు. మేం ఎప్పుడూ ధోనీ ఫేర్‌వెల్ మ్యాచ్‌తోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాం. కానీ అతను ఎవరూ ఊహించని విధంగా ఆటకు గుడ్‌బై చెప్పాడు. అసలు ఆటను గుడ్ బై చెప్తాడని అసలు అనుకోలేదని అన్నారు. ఇక ఈ ఐపీల్ మ్యాచ్ జరిగే సమయాన తనను ఫెరావెల్ మ్యాచ్ గురించి అడిగి తన అభిప్రాయం తెలుసుకుంటాం అని తెలిపారు.