కరోనా వ్యాక్సిన్ పై శుభవార్త

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికె ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి ముప్పై నాలుగు లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దాంట్లో కరోనా బారిన పడి ఐదు లక్షల ఎనబై వేలకు పైగా చనిపోయారు. కరోనా ను కట్టడి చేయడానికి ఇప్పటికే ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న కేసులు మాత్రం అదుపులోకి రావడం లేదు.

ఇక ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాల్లో ని ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె ప్రపంచ దేశాలకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త తెలుపనుంది. కరోనా ను కట్టడి చేయడానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కనిపెట్టిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంది.

ఇక ఈ వ్యాక్సిన్ కు సంబందించిన ఫేస్-3 హ్యూమన్ ట్రయల్స్ ను పూర్తి చేసాం అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. అలాగే కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలలో మంచి ఫలితం వచ్చింది అని యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటికే వివిధ దేశాలలోని వంద మందికి పైగా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయోగాలు చేస్తున్నారు.

ఇలా ఎన్ని దేశాలు ప్రయోగాలు చేస్తున్న దాంట్లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లైసెన్సు పొందించిన ప్రముఖ ఇండియా ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. మొత్తానికి త్వరలో కరోనా వ్యాక్సిన్ కు సంబందించిన శుభవార్త వినే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here