గుడ్ న్యూస్: ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా నెగిటివ్

Advertisement

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా నెగిటివ్ గా వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపాడు. చరణ్ మొన్న చెప్పినట్టే ఈరోజు గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే బాలుకు కరోనా సోకడంతో కొంతకాలంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక బాల సుబ్రహ్మణ్యంకు కరోనా సోకడంతో ఆయన గత కొన్ని రోజులుగా విదేశీ వైద్యుల ఆదీనంలో కరోనా చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే నాన్న ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని మరో వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తన కుమారుడు చరణ్ పేర్కొన్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here