దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ
Admin - August 15, 2020 / 06:28 AM IST

పంద్రాగస్టు ను పురస్కరించుకొని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట వద్ద జెండా ఆవిష్కరించాడు మోడీ. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన తన ప్రసంగంలో కరోనా వైరస్ పై పలు విషయాలు మాట్లాడారు. దేశం మొత్తం కరోనా తో బాధపడుతుంది.
అయితే కరోన మన దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నాడు. అలాగే త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని ధీమా వ్యక్తం చేసాడు. ఇప్పటికే మూడు సంస్థలు వ్యాక్సిన్స్ ట్రయల్స్ లో తుది దశలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నాడు. దేశ ప్రజల భద్రత మరియు ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపాడు.