కరోనా రెండోసారి సోకదు, ఎందుకంటే….

Admin - July 25, 2020 / 08:01 AM IST

కరోనా రెండోసారి సోకదు, ఎందుకంటే….

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.రోజురోజుకి కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. ఇక మన దేశంలోనూ కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా భారిన పడి చాలా మంది మృత్యువాత పడ్డారు.

ఇది ఇలా ఉంటె ప్రస్తుతం చాలా మందికి ఒక సందేహం ఉంది. అది ఏంటంటే కరోనా మొదటి సారి సోకి నయం అయినా తరువాత మల్లి రెండవసారి సోకుతుందా.. అని చాలా మందికి ఈ సందేహం ఏర్పడింది. అయితే ఈ విషయం పై కొంతమంది శాస్త్రవేత్తలు సోకుతుంది అని చెపుతున్నారు. మరికొంతమంది శాస్త్రవేత్తలు ఏమో సోకదు అని చెపుతున్నారు. దీనితో ప్రజలు అందరు కూడా అయోమయంలో ఉన్నారు.

తాజాగా ఒకసారి కరోనా సోకితే రెండవ సారి సోకదని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో వెల్లడించారు. అయితే మొదటి సారి కరోనా వైరస్ భారిన పడినపుడు మన శరీరంలో యాంటీ బాడీస్ సిద్ధం అవుతాయి. దీనితో పాటు శరీరంలో టీ సెల్స్ కరొనాతో పోరాటం చేస్తాయి. దీనివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకోసమే రెండవ సారి కరోనా సోకదని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెపుతున్నారు.

కానీ దీని పై ఎన్నో సందేహాలు వెలువడుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియా దేశంలో మొదటి సారి కరోనా సోకినా వారికి రెండవ సారి కూడా సోకుతుంది అని అక్కడి వైద్యులు మరియు నిపుణులు చెపుతున్నారు. అలాగే రెండవ సారి కరోనా సోకినా వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మళ్ళీరాదని శాస్త్రవేత్తలు చెప్తున్నా.. నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనతో ప్రజల్లో వస్తున్న సందేహం నుండి కాస్త ఉపశమనం లభించనుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us