Nayantara : నయనతార ‘టూ మచ్’ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందా.?
NQ Staff - December 23, 2022 / 06:12 PM IST

Nayantara : ‘లేడీ సూపర్ స్టార్’ అనే గుర్తింపు తమిళ సినీ పరిశ్రమలో నయనతారకి వుంది. ఆమె అక్కడ హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే నటి కూడా.!
ఒకప్పుడు సినిమాల ప్రమోషన్ కోసం అస్సలు నయనతార మీడియా ముందుకొచ్చేది కాదు. కానీ, తన తాజా చిత్రం ‘కనెక్ట్’ కోసం పబ్లిసిటీ పరంగా మీడియాతో బాగానే కనెక్ట్ అవుతోంది. ఈ సినిమాకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాత కూడా.
భారీ కటౌట్.. నయనతారకి మాత్రమేనా…?
తమిళ సినీ పరిశ్రమలో ఏ నటికీ లేని విధంగా సోలో కటౌట్.. అంటూ నయనతార గురించి ‘పీఆర్ యాక్టివిటీ’ విపరీతంగా జరుగుతోంది. నిజానికి, ఈ కటౌట్ల పర్వం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో నడుస్తున్నదే. త్రిష, అసిన్ లాంటి తారలెందరికో సోలో కటౌట్లు పడ్డాయ్.
హన్సిక, నమిత.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామంది హీరోయిన్లకు అక్కడి సినీ అభిమానులు భారీ కటౌట్లు పెట్టారు. పాత తరం నటీమణుల సంగతి సరే సరి.!
మొన్నటికి మొన్న ‘బీస్ట్’ సినిమా సందర్భంగా పూజా హెగ్దే కటౌట్లు కూడా పెట్టేశారు భారీయెత్తున.. అదీ సోలోగా. సో, ఇక్కడ నయనతార విషయంలో అంత స్పెషల్ ఏమీ లేకపోయినా, పీఆర్ కోసం నయనతార చెల్లింపులు గట్టిగా చేయడంతో.. అడ్డగోలు ప్రచారమైతే చేస్తున్నారు.