YS Jagan : గుడ్ న్యూస్ చెబుతూనే బ్యాడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు, జగన్ కి షాక్ + హ్యాపీ
Ajay G - February 7, 2021 / 07:23 PM IST

YS Jagan : ఏపీలో ఇంకా నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్ లాగానే ఉంది. పంచాయతీ ఎన్నికలు ముగిసినా వీళ్ల మధ్య వైరం మాత్ర తగ్గేలా కనిపించడం లేదు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఓవైపు ఎన్నికల కమిషన్ మరోవైపు ఏపీ ప్రభుత్వం.. రెండింటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోర్టులు కూడా ఇప్పటి వరకు నిమ్మగడ్డకే సపోర్ట్ ఇస్తూ వచ్చాయి కానీ.. తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది హైకోర్టు.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఈనెల 21 వరకు పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశించారు. అయితే.. ఎస్ఈసీ ఇచ్చిన ఆ ఆదేశాలను కోర్టు కొట్టేసింది. అయితే.. ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోవద్దని… మీడియాతో ఎన్నికల గురించి మాట్లాడవద్దని.. ఎస్ఈసీ చెప్పిన విషయాన్ని కోర్టు కూడా సమర్థించింది.
అంటే.. ఆయన హౌస్ అరెస్ట్ ను రద్దు చేస్తున్నారు కానీ.. ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల గురించి ఆయన మీడియా ముందు మాట్లాడే అవకాశం లేదన్నమాట. పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వగానే.. పెద్దిరెడ్డి.. రాత్రే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వెంటనే ఉదయమే విచారణ చేపట్టిన హైకోర్టు తన హౌస్ అరెస్ట్ ను రద్దు చేసింది.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందు వార్ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ గా ఉండేది. కానీ.. ఇప్పుడు మాత్రం వార్ నిమ్మగడ్డ వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్టుగా ఉంది. నిమ్మగడ్డను పెద్దిరెడ్డి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల కమిషన్ పై, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులపై పెద్దిరెడ్డి ఆటంకం కలిగిస్తున్నారని.. ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.