Gold Eeized At Shamshabab Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారు చీర పట్టివేత.. ఇది మామూలు ప్లాన్ కాదు..
NQ Staff - August 4, 2023 / 03:05 PM IST
Gold Eeized At Shamshabab Airport :
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ బంగారం దొరికింది.. అక్రమంగా ఇండియాకు తీసుకు వచ్చిన బంగారాన్ని కస్టమ్స్ శాఖ వారు పట్టుకున్నారు.. అక్రమ రవాణాకు అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్న స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు.. మా దారి రహదారి అంటూ కొత్తగా అడ్డదారులను వెతుకుతున్నారు.
దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్న చందాన అక్రమంగా బంగారాన్ని రవాణా చేయడానికి ఏ మాత్రం బయటపడడం లేదు.. ఎప్పటిలానే ఈసారి కూడా శంషాబాబ్ లో భారీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. దుబాయ్ నుండి అక్రమంగా బంగారాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసారు..
అయితే కస్టమ్స్ శాఖ వారు వీరి పాచికలు పారకుండా చేసారు.. ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారం లభ్యమైంది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడు వద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ఎలా తరలిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..
బంగారాన్ని చీరలో దాచి తేవాలని పెద్ద ప్లానే వేసినట్టు ఉన్నాడు.. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు. ఈ బంగారం చీర ఖరీదు అక్షరాలా 28 లక్షలకు పైగానే ఉంటుందట.. ఇంత బంగారాన్ని అధికారులకు చిక్కకుండా ఉండాలని అతడు చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.