మాస్క్ లేదని మేకను అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisement

కరోనా దేశాన్ని పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కులు వాడుతున్నాం. అలాగే ఈ మధ్య మాస్క్ లేని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ మేకకు మాస్క్ లేదని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌లోని బెకన్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతూండటంతో పోలీసులు అతని ప్రశ్నించారు. మాస్క్ లేదన్న భయంతో అక్కడి నుండి మేకను వదిలి యజమాని పారిపోయాడు. మేకను అక్కడే వదిలివెళ్లడంతో పోలీసులు దాని స్టేషన్‌కు తరలించారు.

కొద్దిసేపటి తరువాత యజమాని అక్కడికి వచ్చి చూస్తే మేక లేదు, పోలీసులు లేరు. దీనితో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు పరుగు పెట్టాడు. ఇంకెప్పుడు నిబంధనలను అతిక్రమించనని, అలాగే మాస్క్ ధరిస్తానని పోలీసులను వేడుకున్నాడు. దీనితో పోలీసులు ఆ మేకను వదిలిపెట్టారు.

ఒకవైపు ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు మాస్క్ లేకుండా మేకను అరెస్ట్ చేయడం ఏంటి అని.. మరికొందరు ఏమో తీవ్రంగా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక ఈ మాటలకు పోలీసులు సమాధానం ఇస్తూ.. కుక్కలే మాస్కులు ధరించినప్పుడు.. మేకలు ఎందుకు మాస్క్ ధరించకూడదని అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన వింతగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here