Hero Sharwanand : యాక్సిడెంట్‌ పై శర్వానంద్‌ క్లారిటీ

NQ Staff - May 28, 2023 / 02:51 PM IST

Hero Sharwanand : యాక్సిడెంట్‌ పై శర్వానంద్‌ క్లారిటీ

Hero Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురి అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ వార్తల గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికారు చేశాయి. ఈ విషయమై ఇప్పటికే శర్వానంద్ టీమ్‌ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

శర్వానంద్‌ కి ఎలాంటి గాయాలు కాలేదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా తనకు ఎలాంటి గాయాలు కాలేదంటూ శర్వానంద్‌ క్లారిటీ ఇచ్చారు. చిన్న యాక్సిడెంట్ మాత్రమే అని ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మీ యొక్క ప్రేమ మరియు అభిమానానికి ఆనందంగా ఉంది అంటూ శర్వానంద్ ద్వారా పేర్కొన్నారు. శర్వా ట్వీట్ తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరో నాలుగు రోజుల్లో శర్వానంద్ పెళ్లి జరగబోతున్న విషయం తెలిసిందే.

పెళ్లికి ముందు ఇలాంటి సంఘటన జరగడం పట్ల కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న గాయం కూడా కాకుండా శర్వానంద్ ప్రమాదం నుండి బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us