స్వాతంత్ర్య దినోత్సవం రోజు బాలికపై అత్యాచారం

Advertisement

నిన్న దేశం మొత్తం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్ననే ఉత్తర ప్రదేశ్ లోని ఒక గ్రామంలో 13 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసి, దారుణంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం…నేపాల్‌ సరిహద్దులో ఉన్న లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఇసానగర్‌ పోలీసుల ప్రకారం, పఖారియా గ్రామానికి చెందిన ఓ 13ఏళ్ల మైనర్‌ బాలిక శుక్రవారం మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వెళ్లింది. గంటలు గడుస్తున్నా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బాలికకోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో కూతురు కనిపించడంలేదని బాలిక తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు, కుటుంబ సభ్యులు కలిసి వెతుకుటుండగా ఒక చెరుకు తోటలో నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయగా బాలికను అత్యాచారం చేసి, తరువాత హత్య చేసారని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఒక మహిళ రోడ్ పై ఏ భయం లేకుండా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. అయితే ఇప్పుడున్న సమయంలో రాత్రిళ్లు కాదు పగలు కూడా తిరగలేకపోతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here