Vishwanath : విశ్వనాథ్ మాటకు ఎదురుచెప్పిన గిరిబాబు ఎలాంటి అవుమానం పాలయ్యాడు

K-Viswanath

Vishwanath : విశ్వనాథ్.. ఆర్ట్ డైరెకర్టర్.. కమర్షియల్ సినిమాల కన్నా మానవసంబంధాలకు, సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే సినిమాలు తీసే డైరెక్టర్. ఆయన తోటి డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలు తీస్తుంటే.. విశ్వనాథ్ మాత్రం మొదటి నుంచి ఆర్ట్ సినిమాలను తీసేవారు.

Giri babu insulted by director viswanath : విశ్వనాథ్
Giri babu insulted by director viswanath

విశ్వనాథ్ సినిమా అనగానే శంకరాభరణం గుర్తొస్తుంది. గుర్తింపు ఉన్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. కేవలం కథ ఆధారంగానే సినిమా తీశారు. ఆ రోజుల్లో ఆ సినిమా సంవత్సరం పాటు ఆడిందంటే ఆ సినిమాను ఎంత గొప్పగా తీశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కమల్ హాసన్ తో సాగరసంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం.. వంటి సినిమాలు తీసి ఆయన క్రేజ్ ని మరింత పెంచారు. స్వయంకృషి, ఆపద్భాందవుడు వంటి చిత్రాలతో చిరంజీవి కమర్షియల్ హీరోనే కాదు.. కమల్ హాసన్ లాంటి సినిమాలు చేయగలడని నిరూపించారు.

ఓసారి కృష్ణతో ఆదుర్తి సుబ్బారావు సినిమా చేస్తున్నారు. అప్పుడు ఆదుర్ది సుబ్బారావుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా విశ్వనాథ్ పనిచేసేవాడు. ఆదుర్తి సుబ్బారావుకి ఆరోగ్యం బాగోక ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పుడు విశ్వనాథ్ ని సినిమా షూట్ చేయమని చెప్పారు. ఎందుకంటే కృష్ణ డేట్స్ దొరకడం చాలా కష్టం. అప్పట్లో ఆయన మూడు షిఫ్ట్ లలో సినిమాలు చేసేవారు. ఒకసారి డేట్ పోతే మళ్లీ దొరకడం చాలా కష్టం. అందుకే విశ్వనాథ్ ని షూట్ చేయమన్నారు..

అదే సినిమాలో గిరిబాబు నటిస్తున్నారు. గిరిబాబును డైరెక్ట్ చేసే సమయంలో సీన్ లో నటించి ఇలా చేయాలని విశ్వనాథ్ చూపించారు. అయితే అంతకు ముందు వేరేలా చేశానని.. ఇది సింక్ అవ్వదని గిరిబాబు విశ్వనాథ్ కి చెప్పాడట. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని విశ్వనాథ్ చెప్పాడట. ఆ తర్వాత ఇదే విషయంలో చిన్నపాటి గొడవ కూడా జరిగింది. చివరకు విశ్వనాథే కాంప్రమైజ్ అయ్యాడు. తర్వాత సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. తర్వాత విశ్వనాథ్ డైరెక్టరయ్యాక కూడా ఎప్పుడూ తన సినిమాల్లో గిరిబాబును తీసుకోలేదు.

Advertisement