Gidugu Rudra Raju : శైలజానాథ్ ఔట్, ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు.!

NQ Staff - November 24, 2022 / 06:33 AM IST

Gidugu Rudra Raju : శైలజానాథ్ ఔట్, ఏపీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు.!

Gidugu Rudra Raju : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ వుందా.? లేదా.? ఈ విషయమై ప్రత్యేకంగా చర్చ అనవసరం. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలమైన రాజకీయ శక్తిగా వుండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో, ఏపీలో జీరో అయిపోయింది కాంగ్రెస్.

అసలు ఏపీలో కాంగ్రెస్ నేతలు ఎవరున్నారు.? అని బూతద్దంతో వెతికి చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ నిన్న మొన్నటిదాకా ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వున్నారు. ఇప్పుడాయన్ని తొలగించారు.

కొత్త పీసీసీ.. ఉపయోగమేంటి.?

కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజుని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి తదితరుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

పల్లం రాజు, హర్షకుమార్ తదితర మాజీ ఎంపీలకూ ఆయా కమిటీల బాధ్యతల్ని అప్పగించింది. తులసిరెడ్డికి మీడియా మరియు సోషల్ మీడియా కమిటీ హెడ్‌గా అవకాశం కల్పించింది. అంతా బాగానే వుందిగానీ, ఈ కొత్త నియామకాల వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమన్నా వుందా.?

తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతోంది. వచ్చే ఎన్నికలతో ఆ ముచ్చటా కాంగ్రెస్ పార్టీకి తీరిపోవచ్చు. అలాంటప్పుడు, ఏపీలో మార్పులెందుకు దండగ కాకపోతే.!

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us