గ్రేటర్ హైదరబాద్ : ఈ ఓట్లే కీలకం – ఇవి దక్కినోడే కుర్చీ ఎక్కుతాడు !

తెలంగాణ రాష్ట్రం అవతరించిన 6 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఎన్నికలు హోరా హోరీ గా జరుగుతున్నాయి. బీజేపీ పార్టీ హఠాత్తుగా బలం పుంజుకుంది. దీంతో కేసీఆర్ కి ఎక్కడా లేని భయం పట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ఇప్పటికే ఎన్నో వరాలు కురిపించారు. బహిరంగ మహాసభ కూడా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఐతే ఈసారి హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ తో పాటు చాలా పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు సాధించడం అనేది అన్ని పార్టీలకు కాస్త క్లిష్టంగానే మారింది.

ghmc elections latest updates

కేసీఆర్ పాలనపై హైదరాబాద్ నగరవాసుల్లో చాలా వ్యతిరేకత ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే కేటీఆర్ రోడ్డు షోలు చేస్తూ ప్రజలలో తమపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే 150 డివిజన్లలో జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో 80 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 30 లక్షల మంది సెటిలర్లే ఉన్నారు. ఈ సెటిలర్ల ఓట్లు ఎవరైతే పొందుతారో వారు గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించినట్టే నని చెప్పవచ్చు.

హైదరాబాదులో స్థిరపడిపోయిన ఆంధ్రా సెటిలర్ల యొక్క ఓట్లు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. కులాలు, మతాలు, అభిమాన నాయకులు. ఆంధ్ర సెటిలర్లలో ఎంతో కొంత మంది టీడీపీ కి ఓటు వేసే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం యొక్క ఓట్లు ఎవరికి వెళ్తాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ కి జగన్ కి మధ్య వైరం ఏర్పడింది అని గత కొద్ది నెలలుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరి అది దృష్టిలో పెట్టుకుని రెడ్డి సామాజిక వర్గాలు కేసీఆర్ కి కాకుండా వేరే పార్టీలకు ఓటు వేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొన్నీమధ్య దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనితో బీజేపీ పార్టీపై ఆంధ్రా సెటిలర్లు అందరూ తీవ్ర విమర్శలు చేశారు. రఘునందన్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు కానీ సెటిలర్లు బీజేపీ కి ఓట్లు వేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆంధ్రా సెటిలర్లు ఓట్లను ఎవరైతే ఎక్కువగా పొందుతారో వారు మేయర్ పీఠాన్ని అధిష్టించడం ఖాయం కానీ పొందే వారు ఎవరో చెప్పలేని పరిస్థితి.

Advertisement
Advertisement