Ghattamaneni Adi Seshagiri Rao : నరేశ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు.. కృష్ణ తమ్ముడు క్లారిటీ..!
NQ Staff - May 28, 2023 / 09:04 AM IST

Ghattamaneni Adi Seshagiri Rao : ఇప్పుడు ఇండస్ట్రీలో వీకే నరేశ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన నటి పవిత్ర లోకేష్ తో ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. ఈ వయసులో వీరిద్దరూ ఇలా డేటింగ్ చేయడం.. అది కూడా పబ్లిక్ గానే ముద్దులు, హగ్గులు ఇచ్చుకోవడంతో రచ్చ అవుతోంది. ఇక రీసెంట్ గా వీరిద్దరూ కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాలో నటించారు.
ఈ మూవీ ప్రమోషన్ లో నరేశ్ ఓ క్లారిటీ ఇచ్చారు. పవిత్రతో తన పెండ్లికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒప్పుకున్నాడంటూ చెప్పారు. అయితే ఇదే విషయం మీద మహేశ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు మీకు, మహేశ్ కు ఏంటి సంబంధం అంటూ సీరియస్ అవుతున్నారు. అయితే ఇదే విషయం మీద సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఆది శేషగిరి రావు క్లారిటీ ఇచ్చారు.
ఈయన కృష్ణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారు. చాలా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే నరేశ్ గురించి గతంలోనే ఆదిశేషగిరిరావు క్లారిటీ ఇచ్చారు. పవిత్ర లోకేష్ తో నరేశ్ సహజీవనం బయటకు వచ్చినప్పుడే ఆయన స్పందించారు. అసలు నరేశ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన తెలిపారు.
విజయ నిర్మల మొదటి భర్తకు పుట్టిన కొడుకుతో మాకేంటి సంబంధం అంటూ తేల్చి చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తుంటే నరేశ్ ఏదో మీది మాటకు మహేశ్ ఒప్పుకున్నాడని చెబుతున్నట్టు తెలుస్తోంది. మహేశ్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి నెగెటివిటీ రాకుండా ఉండేందుకు ఆయన ఇలాంటి కామెంట్లు చేశాడని తెలుస్తోంది.