sudheer రష్మీతో అలా తిరిగాడట.. సుధీర్ పెళ్లిని అడ్డుకున్న గెటప్ శ్రీను, రాం ప్రసాద్
NQ Staff - March 20, 2021 / 02:28 PM IST

sudheer : సుధీర్ రష్మీ అనే టాపిక్ ఎప్పిటికీ బోర్ కొట్టదు. బుల్లితెర పై ఈ జంట చేసే రచ్చ అలాంటిది మరి. ఏడు ఎనిమిదేళ్లుగా ఈ ఇద్దరూ తమ అభిమానులనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇద్దరం కేవలం స్నేహితులమేనని చెప్పినా కూడా జంటగా మారాలంటూ అభిమానులు ఒత్తిడి చేస్తుంటారు.
తాము చేసేదంతా కూడా జనాలను నవ్వించేందుకే.. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఏది చేయమన్నా చేస్తాం.. అయితే అదంతా తెర వరకే. తెర వెనకాల మాత్రం మేం ఇద్దరం మంచి స్నేహితులం. కనీసం ఒకరి నంబర్లు మరొకరికి కూడా తెలియవు.. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అన్నట్టుగా ఆ మధ్య సుధీర్ వివరించాడు.

అలా తెరపై మాత్రమే కెమిస్ట్రీని ఓ రేంజ్‌లో పండిస్తుంటారు రష్మీ సుధీర్. వీరిద్దరి మధ్య ఉన్న ట్రాకును వాడుతూ స్కిట్లు వేస్తుంటారు. అలా తాజాగా ఓ స్కిట్ వేశారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా వచ్చింది. ఇందులో సుధీర్ పెళ్లి కొడుకు అయ్యాడు. పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్న సుధీర్‌కు గెటప్ శ్రీను, రాం ప్రసాద్ అడ్డు తగిలారు.
రష్మీతో అలా తిరిగాడట..
సుధీర్ పెళ్లిని ఎలా అయినా ఆపాలని రష్మీని వాడేశారు. రష్మీకి సుధీర్‌కి మధ్య ఏదో ఉందని చెబుతూ పెళ్లిని ఆపేశారు. ఈ ఇద్దరూ ఎక్కడెక్కడో తిరిగారు. పబ్‌లకు వెళ్లారు.. నాతోనే ఉండాలంటూ బాండ్ కూడా రాసుకున్నారంటూ ఉన్నవీ లేనివి చెప్పారు. మొత్తానికి రష్మీ సుధీర్ గురించి బయట అనుకునే వాటినే స్కిట్లలో పెట్టి రచ్చ చేస్తున్నారు.