Doctor : పెంపుడు కుక్కకి హార్ట్ సర్జరీ : జర్మనీ నుంచి వచ్చిన వైద్యుడు.!

NQ Staff - January 2, 2023 / 03:09 PM IST

Doctor : పెంపుడు కుక్కకి హార్ట్ సర్జరీ : జర్మనీ నుంచి వచ్చిన వైద్యుడు.!

Doctor : బతికితే గొప్పోడింట్లో కుక్కగా అయినా బతకాలంటారు కొందరు.! ఇదిగో, ఇది చదివితే అలాగే అనిపిస్తుంది చాలామందికి.

ఆ కుక్క పేరు వాఫెల్. దానికి గుండెలో ఏదో సమస్య వుంది. సర్జరీ చేయాల్సి వుంటుంది. ఆ సర్జరీ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రముఖ వైద్యుడొకరు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది.

ఖర్చు కాదిక్కడ మేటర్..

ముంబైలోని జుహులో వుండే రాణి రాజ్ వంకావాలా ఇంట్లోని పెంపుడు కుక్క పేరు వాఫెల్. దానికి తలెత్తిన గుండె సమస్యను సరిచేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మాథియాస్ ఫ్రాంక్ ముంబైకి వచ్చారు.

నిజానికి, జర్మనీకే ఆ కుక్కని తీసుకెళదామనుకున్నారట. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రిస్క్ ఎందుకని ఆలోచించి, ఆ వైద్యుడ్నే రప్పించారు. అంధేరీలోని డాక్టర్ మర్కంద్ చౌసాల్కర్ క్లినిక్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన నాలుగు వారాల తర్వాత వాఫెల్ పూర్తిగా కోలుకుంది.

ఖర్చు లక్షల్లో అయ్యిందని అనుకోవాలా.? లేదంటే, కోట్లలో అయి వుంటుందా.? అందుకే మరి, పుడితే.. గొప్పోడింట్లో కుక్కలా అయినా బతకాలనేది. ఆ కోట్లు లేదా.. లక్షలు.. సామాన్యుల కోసం ఖర్చు చేస్తే, ఎంతోమంది ప్రాణాల్ని కాపాడగలిగేవారు కదా.?

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us