Gautham Krishna Fight With Prince Yawar : ఇంజెక్షన్ వేయించుకుని బాడీ పెంచావన్న గౌతమ్.. పోటీలోకి అమర్ దీప్..!
NQ Staff - September 16, 2023 / 11:45 AM IST

Gautham Krishna Fight With Prince Yawar :
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడిప్పుడే రంజుగా సాగుతోంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ తన టైమింగ్ తో గొడవలు పెట్టేస్తున్నాడు. బాధితులకు మళ్లీ ధైర్యం నూరిపోస్తున్నాడు. దాంతో బిగ్ బాస్ షో గురించి సోషల్ మీడియాలో బాగానే రచ్చ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ లో కొన్ని పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయి. ఒక టీమ్ తో మరో టీమ్ కంటెండర్లను డిసైడ్ చేయిస్తున్నాడు. ఇక పవర్ అస్త్రాను సాధించేందుకు రణధీర టీమ్ నుంచి ఆరుగురు పోటీలో ఉండగా చివరకు ముగ్గురు శివాజీ, షకీలా, ప్రిన్స్ యావర్ నిలిచారు. కానీ ఈ ముగ్గురిలో ఇద్దరిని ఫైనల్ కు పంపించాలని బిగ్ బాస్ చెప్పాడు.
ఇక చివరగా మాయాస్త్ర పవన్ ను డిసైడ్ చేసే అవకాశాం మహాబలి టీమ్ నుంచి గౌతమ్ కృష్ణకు వచ్చింది. దాంతో అతను వచ్చి ప్రిన్స్ దగ్గరున్న మాయాస్త్రను తీసి శివాజీకి ఇస్తానన్నాడు. శివాజీ టీమ్ ను సరిగా మేనేజ్ చేశాడని, రెండు సార్లు విన్ అవ్వడానికి కారకుడు అయ్యాడని.. ప్రిన్స్ సరిగ్గా ఆడలేదని చెప్పుకొచ్ఛాడు. కానీ ప్రిన్స్ దానికి ఒప్పుకోలేదు. తానే రెండు సార్లు గేమ్ గెలిపించానని వాదించాడు. గౌతమ్ చెప్పింది సరైన కారణం కాదని అరిచాడు. కెమెరా దగ్గరకు వెళ్లి తనకు న్యాయం కావాలని బిగ్ బాస్ మీద అరిచాడు. గేట్స్ తెరిస్తే తాను వెళ్లిపోతానని ఏడ్చేశాడు.
తనకు సరైన కారణం చెప్పి తన మాయాస్త్రను తీసుకోవాలని గౌతమ్ కు సూచించారు. కానీ తాను చెప్పింది సరైన కారణమే అని గౌతమ్ అరిచాడు. ఇలా ఇద్దరి నడుమ పెద్ద వారే నడిచింది. యావర్ ఏదో సైగ చేసేందుకు ప్రయత్నించగా… ప్రిన్స్ నువ్వు బాడీని పెంచడానికి ఇంజక్షన్ తీసుకున్నావ్ అన్నట్టు గౌతమ్ సైగలు చేశాడు. దాంతో ప్రిన్స్ కోపంతో ఊగిపోయాడు. ఏంటి నేను ఇంజెక్షన్ తీసుకున్నానా.. నువ్వేమైనా చూశావా.. పోనీ డబ్బులు ఇచ్చావా అంటూ అడిగాడు ప్రిన్స్. తాను హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ ఏడ్చేశాడు ప్రిన్స్. చివరకు హౌస్ మేట్స్ అంతా వచ్చి ప్రిన్స్ ను ఓదార్చారు.
చివరకు తన టీమ్ మెంబర్స్ నచ్చజెప్పడంతో మాయాస్త్రను ఇచ్చాడు ప్రిన్స్. దాన్ని గౌతమ్ తీసుకెళ్లి శివాజీకి ఇచ్చాడు. అయితే రేసులో మరో కంటెస్టెంట్ ను ఉంచాలని బిగ్ బాస్ చెప్పాడు. ఆ అవకాశాన్ని ఆట సందీప్ కు ఇచ్చాడు. దాంతో సందీప్ అమర్ దీప్ ను పోటీలో ఉంచేందుకు ఓకే చేశాడు. ఇప్పుడు పోటీలో శివాజీ, అమర్ దీప్, షకీలా ముగ్గురు కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది మాత్రం వీకెండ్ ఎపిసోడ్ లో తేలిపోనుంది. కాగా ప్రిన్స్ యావరను బిగ్ బాస్ కన్పెన్షన్ రూమ్ లోకి పిలిచాడు.
ధైర్యంగా ఉండాలంటూ చెప్పి పంపించాడు. ఇక పోటీలో మిగిలిన ముగ్గురికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. షకీలా, శివాజీ, అమర్ దీప్ లు తమ తోటి కంటెస్టెంట్ల చెవిలో గట్టిగా అరవాలని.. ఎవరైతే గట్టిగా అరుస్తారో వారే విన్నర్ అంటూ చెప్పాడు. ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్ లో రానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఎవరు విన్ అవుతారో అనేది.