ఐపీల్ తొలి మ్యాచ్ గెలిచేది ఆ జట్టే : గౌతమ్ గంబీర్

Advertisement

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సమ్మర్ లో జరగవలసిన ఐపీల్ నిర్వహించలేదు. ఇక దీనితో క్రికెట్ ప్రేమికులు ఐపీల్ ఎప్పుడు నిర్వహిస్తారా.. అని వేచి చూస్తున క్రమంలో ఓ శుభవార్త చెప్పారు. అయితే కరోనా దృష్ట్యా ఐపీల్ యూఏఈ లో నిర్వహించడానికి ప్లాన్ ముమ్మరం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అని జట్టులు యూఏఈకి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాయి. ఇక సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగున్నాయి. ఇక మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై జట్ల మధ్య జరగనుంది.

ఇక ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. అయితే ఈ మొదటి మ్యాచ్ లో ముంబై జట్టుదే పై చేయి అని గంబీర్ తేల్చి చెప్పాడు. అయితే ముంబై జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ల బౌలింగ్ చూడడానికి ఎదురు చూస్తున్న అని పేర్కొన్నాడు. ఇక చెన్నై జట్టులో రైనా, హర్భజన్ లాంటి సీనియర్ క్రికెటర్లు లేకపోవడం జట్టుకు కాస్త నిరాశే అని అభిప్రాయం వ్యక్తం చేసాడు. ఇక ఈ ఐపీల్ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here