Gautam Gambhir : రోహిత్, కోహ్లీ వంటి వారు వస్తారు.. కానీ ధోనీ లాంటి వారు కష్టం!
NQ Staff - November 11, 2022 / 01:33 PM IST

Gautam Gambhir : టీమిండియా కు ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసి పెట్టిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మూడు ఐసీసీ ట్రోఫీలను తన కెప్టెన్సీలో ధోని ఇండియా కు అందించాడు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ కూడా ఏ టీం ఇండియా కెప్టెన్ కి సాధ్యం కాదు అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై టీ 20 వరల్డ్ కప్ 2022 నుండి వైదొలిగిన టీమిండియా పై సీనియర్స్ వరుసగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కంటే వేగంగా డబుల్ సెంచరీ చేసే క్రికెటర్స్ భవిష్యత్తులో రావచ్చు.. అలాగే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసే ఆటగాళ్లు కూడా భవిష్యత్తులో రావచ్చు, కానీ ఐసీసీ మూడు ట్రోఫీలను అందించ గల కెప్టెన్ మాత్రం భవిష్యత్తులోనే కాదు ఎప్పటికీ రాకపోవచ్చు అంటూ తన అభిప్రాయంను గౌతమ్ గంభీర్ తెలియజేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ధోని యొక్క గొప్పతనంకు గౌతమ్ గంభీర్ యొక్క వ్యాఖ్యలు ప్రత్యక్ష నిదర్శనం అన్నట్లుగా క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అద్భుతం జరిగితే తప్పితే ధోని మాదిరిగా మూడు ట్రోఫీలను అందించగల కెప్టెన్ భవిష్యత్తులో వచ్చే అవకాశం టీమ్ ఇండియా కి లేదు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.