మనిషికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా లోపల ఏదీ దాచుకోలేడు. ఎప్పుడో ఒకసారి లోపల ఉన్నదాన్నంతా బయటపెట్టాల్సిందే. అదే మనిషి నైజం. ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్న రాజకీయ దాడులపై కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు బరస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను టార్గెట్ చేసుకొని.. వాళ్లను లోపలికి పంపించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. అది కూడా కేవలం వైజాగ్ లోనే జరుగుతుండటం గమనార్హం.

వైజాగ్ నే వైసీపీ టార్గెట్ చేయడానికి కారణం.. వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రకటించడం. వైజాగ్ మొత్తం తమ చెప్పుచేతుల్లోకి రావాలంటే.. వైజాగ్ లో ఉన్న బలమైన ప్రత్యర్థులను ఏరిపారేయాలి. అందుకే వైసీపీ ప్రభుత్వం విశాఖపై దృష్టి పెట్టింది.
వైజాగ్ లో వైసీపీ చేసే అరాచకాలు చూడలేక.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారట. ఏదో ఒక రోజు ఆయన వైసీపీపై, సీఎం జగన్ పై బరస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి.. గంటా అరిచే రకం కాదు. బయటికి వచ్చి రచ్చ రచ్చ చేసే రకం కూడా కాదు. కానీ.. ఎవరైనా ఎంతసేపు ఆగుతారు. ఇంకా సహిస్తూ కూర్చోవడం తన వల్ల కాదని.. చివరకు ఆయన అనుచరులను కూడా టార్గెట్ చేస్తుంటే వైసీపీ బండారం బయటపెట్టాల్సిందేనంటూ ఆయన ప్లాన్లు వేస్తున్నారట. చూద్దాం మరి ఆయన ఎప్పుడు బరస్ట్ అవుతారో?