షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ నుండి గంగవ్వ అవుట్, కారణం ఇదే..!

Admin - October 10, 2020 / 11:14 AM IST

షాకింగ్ న్యూస్.. బిగ్ బాస్ నుండి గంగవ్వ అవుట్, కారణం ఇదే..!

బిగ్ బాస్ ఫోర్, అన్ని సీజన్ ల కంటే ఈ సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొత్త కొత్త టాస్కులతో అటు హౌస్ మేట్స్, అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హౌస్ నుండి ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ వారం కూడా ఎలిమినేషన్ పక్రియ ఉందని బిగ్ బాస్ స్పష్టం చేసాడు. దీనితో హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ ప్రేక్షకులు. అయితే ఈ వారంలో అభిజిత్, అఖిల్, మోనాల్, లాస్య, అమ్మ రాజశేఖర్, సుజాత, సోహెల్, అరియనా మరియు నోయెల్ లు నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్లే అవకాశం ఉంది.

ఇక ఓటింగ్ పరంగా చూస్తే వీరందరిలో తక్కువ ఓటింగ్ లో అమ్మ రాజశేఖర్, సుజాతాలు ఉన్నారు. ఇక తరువాత స్థానంలో మోనాల్ ఉంది. అయితే ఈ ముగ్గురిలో తక్కువ ఓట్లు మాత్రం అమ్మ రాజశేఖర్ మాస్టర్ కె ఉన్నాయి. ఇక దీన్నిబట్టి చూస్తే ఈ వారం అమ్మ రాజశేఖర్ బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా మరికొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వారం హౌస్ నుండి గంగవ్వ బయటకు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా గంగవ్వ అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి వరకు కాస్త ఉషారుగా ఉన్న గంగవ్వ.. మల్లి ఇంటి బెంగ పెట్టుకుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ కన్నీరు పెట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండలేక పోతున్నాను అని, కడుపు నిండా అన్నం తినే నేను.. ఇక్కడ పిడికెడు మెతుకులు కూడా తినలేక పోతున్నాను అని వాపోయింది. ఇక ఆమె భాదను అర్ధం చేసుకుని, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వ ను బయటకు పంపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి గంగవ్వను బయటకు పంపిస్తారో.. లేక తక్కువ ఓట్లు ఉన్న అమ్మరాజశేఖర్ ను బయటకు పంపిస్తారో తెలియాలంటే ఈ ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us