గణేష్ ఉత్సవాల పై కీలక నిర్ణయం. ఏంటో తెలుసా..!

Advertisement

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు దారుణంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. అయితే కరోనా దృష్ట్యా ఇప్పటికే నగరంలో బోనాల పండగ నిరాడంబరంగా జరిగింది. ఇదే క్రమంలో రానున్న మొహరం, గణేష్ చవితి ఉత్సవాలు కూడా జరగనున్నాయి. అయితే ఈ ఏడాది మొహరం, గణేష్ నవరాత్రులు ఇంట్లోనే జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సీపీ సోషల్ మీడియా వేదికగా కీలక విషయాలను వెల్లడించారు. జాగ్రత్తలు పాటిస్తూ ప్రతిఒక్కరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే కరోనా నుండి మీ కుటుంబాన్ని రక్షించండి. మొహరం, గణేష్ పండుగలను మీ ఇంట్లోనే జరుపుకొండి. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మండపాలకు, విగ్రహాలకు, ఉరేగింపులకు అనుమతులు లేవు. మీరు ఇంట్లోనే ఉండండి హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచండి అంటూ సీపీ అంజనీకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here