గణేష్ నిమజ్జనాలకు ఈ ఏడాది అనుమతి లేదు : డీడీఎంఏ

Advertisement

కరోనా దృష్ట్యా పండగలకు అన్నింటికీ కూడా అడ్డుకట్ట పడుతుంది. ఇప్పటికే పలు పండగలను నిడంబరంగా జరుపుకున్నాం. ఇక అదే బాటలో గణేష్ నవరాత్రులు కూడా జరగనున్నాయి. వివరాల్లోకి వెళితే దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ (డీడీఎంఏ) నేడు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఏడాది గణేష్ నవరాత్రుల ఉత్సవాలపై నిషేధం తెలిపింది. ముఖ్యంగా గణేష్ మండపాలను బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని తెలిపారు.

అలాగే గణేష్ విగ్రహాలను కూడా నిలుపరాదని వెల్లడించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనాలు కూడా ఉండవని స్పష్టం చేసారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండడం, కమ్యూనిటీ సెలబ్రేషన్లు, విగ్రహాల నిమజ్జనాలు ఈ ఏడాది ఉండవని ఈ రోజు ఉదయం ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ లో తెలిపింది. అలాగే ఢిల్లీ ప్రజలందరూ కూడా తమ ఇళ్లలోనే విగ్రహాలు నిలుపుకొని, నిమజ్జనం చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే 5,000 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here