ఈ పండ్లను రాత్రి సమయంలో తినకూడదా! తింటే ఏమవుతుంది ?

Advertisement

పండ్లతో పోషకుల పుష్కలంగా ఉంటాయి కాబట్టి డాక్టర్స్ సైతం పండ్లను తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఆ సలహా మేరకు రోగులు కూడా ఫ్రూట్స్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఈ ఫ్రూట్స్ ను కూడా ఎలా పడితే అలా, ఏ టైం లో పడితే ఆ టైం తినకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళ చెప్పే మాటలను మనం అస్సలు పట్టించుకొము. అయితే ఇప్పుడు సైన్స్ సైతం కొన్ని ఫ్రూట్స్ ను టైంను బట్టి తినాలని సూచిస్తుంది. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ లో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

యాపిల్ పండులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు ఉంటాయి. అయితే ఈ యాపిల్ ను మాత్రం రాత్రి సమయంలో తినకూడదని సైన్స్ చెప్తుంది, అలాగే పెద్దలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే యాపిల్ లో పోషకాలు మాత్రమే కాదు అందులో యాసిడ్స్ ఉండటం వల్ల రాత్రి వేళ యాపిల్ తింటే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరిగి జీర్ణ వ్యవస్థపై భారాన్ని కలిగిస్తుంది. అందుకే యాపిల్‌ను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.
అలాగే అరటి పండును కూడా రాత్రి సమయంలో తినడకూడదని, మధ్యాహ్నం తినాలని సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అరటి పండు తింటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుంది. అంతేకాదు.. అరటి పండును పరగడుపున కూడా తీసుకోకూడదు. అరటి పండులో ని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ విషయాలను గుర్తిపెట్టుకోండి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here