సెప్టెంబర్ నుండి ఏ లాక్ లూ లేవు. కానీ..

Advertisement

కరోనా ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అయితే మన దేశంలోను చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే సర్కార్ విధించిన లాక్ డౌన్ ను మూడు దశలుగా అన్ లాక్ ప్రక్రియను అమలు చేసింది. అయితే ఇప్పటికే అందరం కూడా సాధారణ జీవితం గడుపుతున్నాం. కానీ ఇప్పటికి సినిమా హాళ్లు, విద్యా సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. అయితే ఈ సెప్టెంబర్ నుండి అన్ లాక్ మూడవ దశ ముగుస్తున్న నేపథ్యంలో ఇక సినిమా హాళ్లు, విద్యా సంస్థలు కూడా తెరుచుకోనున్నాయి. అలాగే కేంద్ర సర్కార్ మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది.

అయితే ఆగష్టు నెల ఆఖరు తరువాత సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏ రకమైన ఇండస్ట్రీలపైనా కానీ.. వ్యవహారాలపైనా ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశాలు లేవంటున్నారు. ఇప్పటికె సినిమా షూటింగ్ లకు ఆంక్షల్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక సినిమా థియేటర్లు మాత్రమే ఇంకా మూతపడి ఉన్నాయి. ఇక అవి కూడా తెరిస్తే లాక్ డౌన్ ప్రక్రియ ముగిసినట్లే అవుతుంది. ఇప్పటికే ప్రజల ఆర్థిక వ్యవస్థ దారుణంగా మారింది. ఇక లాక్ డౌన్ ముగియడంతో అన్ని సంస్థలు తెరుచుకుంటే ఆర్థిక వ్యవస్థ కాస్త కుదుటపడనుంది. అలాగే ఒకవైపు కేంద్రం ఇప్పటికే ఆత్మ నిర్భర ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి తరువాత ఈ అత్మనిర్భర ప్యాకేజీ ఫలితాలు ప్రజలకు అందే అవకాశం ఉంది.

ఒకవైపు లాక్ డౌన్ ఎత్తేసిన కరోనా మాత్రం కుటుపడలేదు. రోజు రోజుకు కేసులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఇక వైరస్ ను కట్టడి చేయడానికి కొన్ని నిబంధనలు కూడా పెట్టనున్నారు. ప్రజలు ఎక్కువ మందితో గుంపులుగా చేరి జరిగే కార్యక్రమాలపై ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్లు సహా ప్రచార కార్యక్రమాలు అన్నింటినీ ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇక ఈ ఒక్కటి తప్ప సెప్టెంబర్ నెల నుండి ఎలాంటి నిబంధనలు ఉండే అవకాశం లేదు. ఇక ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా తో సహజీవనం చేయాలనీ కేంద్ర సర్కార్ సూచిస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here