ఒకేరోజు నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా

Advertisement

కరోనా దేశంలో రోజురోజుకు వేగంగా పెరుగుతుంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులు చాలా మంది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె పంజాబ్ రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు ఎమ్మెల్యేలు కరోనా పడ్డారు. ఇక ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అయితే కరోనా సోకిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు రణదీప్ నభా(కాంగ్రెస్‌), అంగద్ సింగ్‌(కాంగ్రెస్‌), అమన్ ఆరోరా(ఆప్), పర్మీందర్ దింద్షా(శిరోమణి అకాలీదళ్‌) ఉన్నారు.

కరోనా సోకిన వారందరు కూడా త్వరగా కరోనా నుండి కోలుకోవాలని సీఎం అమరేందర్ సింగ్ కోరుకున్నారు. అలాగే ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించాడు. ఇక పంజాబ్ లో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఉండగా, దాంట్లో 33 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here