Gang Rape : రేప్ సీన్ రివర్స్ అయ్యిందే.! అబ్బాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు అమ్మాయిలు.!
NQ Staff - November 25, 2022 / 12:08 PM IST

Gang Rape : ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటూ స్ర్తీలు, పురుషులతో అన్ని విషయాల్లోనూ పోటీపడుతుంటారు. పడాలి కూడా. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పోటీ కాస్త భిన్నంగా వుంది.
అన్నింట్లోనూ.. అస్సలేమాత్రం తగ్గేదే లే.. అనే ఆడవాళ్లు. ఇప్పుడు ఇంకాస్త తెగించి రేపు సీన్లలోనూ అదేనండీ సామూహిక రేప్ సీన్లలోనూ మేమేం తక్కువ కాదంటున్నారు.
నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినడానికే కష్టంగా వున్న ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది.
సిగ్గు.. సిగ్గు.. ఈ సమాజం ఎటు పోతోంది.?
ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలన్న లక్ష్యంతో నలుగురు యువతులు ఒళ్లూ పై తెలియకుండా, రోడ్డుపై వెళుతున్న అమాయక యువకున్ని అపహరించి కారులో తీసుకెళ్లి అతనిపై సామూహిక అత్యాచారం చేశారు.
బాధితుడు సమాచారం ప్రకారం, పంజాబ్‌లోని జలంధర్ లెదర్ కాంప్లెక్స్ రోడ్‌లో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న యువకుడు మద్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో రోడ్డుపై ఓ పక్కకు ఆగి వున్న కారులోంచి ఇద్దరమ్మాయిలు దిగి, అడ్రస్ అడిగారట.
అడ్రస్ కోసం అతన్ని కారులో ఎక్కించుకుని వెళ్లిన యువతులు, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరిపై ఒకరుగా అత్యాచారం చేసి అతన్ని అక్కడే వదిలి వెళ్లారనీ చెబుతున్నాడు. పట్టపగలే ఈ దారుణం జరగడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమే.