కరోనా భారిన పడ్డ టీడీపీ నేత అచ్చెన్నాయుడు

Advertisement

దేశంలో ఇప్పటికే చాలమంది రాజకీయ నాయకులు కరోనా భారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ నేత అమిత్ షా, వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి లాంటి ఎంతోమంది రాజకీయ నాయకులు కరోనా భారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని అచ్చెన్నాయుడి తరుపు లాయర్ తెలిపారు.

ఈఎస్ఐ కుంభకోణం ఆరోపణల వల్ల పోలీసులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యము కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తాజాగా ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని ఎలా విచారణ చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్న నేపధ్యంలో అచ్చెన్నాయుడికి కరోనా సోకడంతో ఈ కేసు ఎక్కడికి దారి తిస్తుందో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here