మాజీ రాష్ట్రపతి కి కరోనా పాజిటివ్

Advertisement

దేశంలో కరోనా రోజు రోజుకు తీవ్రంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇలా చాలా మంది కూడా వైరస్ బారిన పడ్డారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఎమ్మెల్యే లు, ఎంపీ లు, ఇతర రాజకీయ ప్రముఖులు చాలా మంది కూడా కరోనా బారిన పడ్డారు. అయితే దింట్లో చాలా మంది కోలుకున్నారు. అలాగే ఒకరిద్దరు నాయకులూ ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ఓ ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపాడు. ఇటీవల తనను కలిసిన వారు కూడా క్వారంటైన్ లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల ఇస్తున్న సూచనల మేరకు ప్రణబ్‌ ముఖర్జీ క్వారంటైన్ లో ఉంటున్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here