విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం

Advertisement

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటివరకు కూడా కోమాలోనే ఉన్నాడు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చి అండ్‌ రిఫెరల్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉంటె తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి పై బులిటెన్ విడుదల చేసారు. అయితే ప్రణబ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అలాగే ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తుతం డీప్‌ కోమాలోనే ఉన్నప్పటికీ గతంలో కంటే ఆరోగ్యం కాస్త మెరుగు పడినట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇక ప్రణబ్‌ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్‌ రేటు స్థిరంగా సాధారణమైన స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఆయన మూత్రపిండలకు సంపాందించిన వ్యవస్థ పని తీరు కూడా మెరుగ్గానే ఉన్నట్లు వెల్లడించారు. అలాగే నిరంతరం ఆయన ఆరోగ్యం పై పరివేక్షిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here